తెలంగాణ

telangana

ETV Bharat / crime

పల్నాడులో టీడీపీ నేతపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు.. విషమంగా పరిస్థితి.! - Firing on Venna Balakotireddy

Murder Attempt On TDP Leader: ఏపీలో టీడీపీ నేతలపై హత్యాయత్నాలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా పల్నాడులోని టీడీపీ నేతపై దుండగులు రెండు రౌండ్ల కాల్పులు జరిపారు. ఆ నేత పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉంది. వైసీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న వ్యక్తిని అరెస్టు చేశారు.

Murder Attempt On TDP Leader
టీడీపీ నేతపై తుపాకీతో కాల్పులు

By

Published : Feb 2, 2023, 3:18 PM IST

Unknown Person Shot At The TDP Leader: ఆంధ్రప్రదేశ్​లోని రొంపిచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై దుండగులు.. కాల్పులకు తెగబడ్డారు. బాలకోటిరెడ్డి ఇంట్లో ఉన్న సమయంలో తుపాకీతో రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. గతంలో రొంపిచర్ల ఎంపీపీగా వెన్నా బాలకోటిరెడ్డి పని చేశారు. కొద్దిరోజుల క్రితం కూడా బాలకోటిరెడ్డిపైనా ప్రత్యర్థులు దాడి చేశారు. ఆయన వాకింగ్ చేస్తున్న సమయంలో కత్తులతో దాడికి పాల్పడ్డారు. తాజాగా మరోసారి పక్కా ప్లాన్‌తో దాడికి చేశారు. తుపాకితో కాల్చడంతో..2తూటాలు పొత్తి కడపులోకి దూసుకెళ్లాయి. వెంటనే ఆయనను.. నరసరావుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో.. మెరుగైన వైద్యం కోసం ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై జరిపిన కాల్పుల్లో ఓ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీలో క్రియాశీల కార్యకర్తగా ఉన్న నుదురుపాడుకు చెందిన వెంకటేశ్వర్లుని పల్నాడు జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

బాలకోటిరెడ్డిని పరామర్శించిన టిడీపీ నేత అరవిందబాబు:నరసరావుపేట ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలకోటిరెడ్డిని టీడీపీ నేత అరవిందబాబు పరామర్శించారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉందని తెలిపారు. బాలకోటిరెడ్డిపై గతంలోనూ హత్యాయత్నం జరిగిందని అరవిందబాబు ఆరోపించారు. దీంతో ప్రాణహాని ఉందని ఎస్పీకి గతంలోనే ఫిర్యాదు చేశాము.. కానీ బాలకోటిరెడ్డికి రక్షణ కల్పించటంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారని అన్నారు.

పల్నాడులో టీడీపీ నేతపై దుండగులు కాల్పులు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details