ఆంధ్రప్రదేశ్- ఒడిశా సరిహద్దుల్లో మావోయిస్టులు, జవాన్లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. బౌడా-కందమాల్ సరిహద్దుల్లో ఎదురుకాల్పులు(firing) జరిగినట్టు తెలుస్తోంది. నక్సల్స్(naxals) కదలికల సమాచారంతో ఒడిశా పోలీసుల సాయంతో గాలింపు చేపడుతుండగా... ఈ ఘటన చోటు చేసుకుంది.
AOB: ఏవోబీలో ఎదురుకాల్పులు.. ఇద్దరు జవాన్లకు గాయాలు - ఏవోబీలో ఎదురుకాల్పులు న్యూస్
ఆంధ్రప్రదేశ్- ఒడిశా సరిహద్దుల్లో మళ్లీ తుటా పేలింది. ఇటీవలే.. తీగలమెట్ట వద్ద జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు మావోయిస్టులు మరణించగా... తాజాగా మరోసారి ఫైరింగ్ జరిగింది. ఈ ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లకు గాయాలైనట్టు సమాచారం.
firing-in-aob-and-2-soldiers-injured
గత నెలలోనే.. ఏపీలోని విశాఖ(vishaka) జిల్లా కొయ్యూరు మండలం మంప పీఎస్ పరిధిలో ఎదురుకాల్పులు జరిగాయి. తీగలమెట్ట వద్ద గ్రేహౌండ్స్ దళాలు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఆరుగురు మావోయిస్టులు మృతి చెందిన విషయం తెలిసిందే. డీసీఎం కమాండర్ సందె గంగయ్యలాంటి కీలక మావోయిస్టు నేత ఈ కాల్పుల్లో మరణించారు. అయితే తాజాగా మళ్లీ ఏవోబీలో తుపాకీ చప్పుడు వినిపించడం కలకలం సృష్టిస్తోంది.