Firing Caused A Stir in Medchal District: మేడ్చల్ జిల్లాలో కాల్పులు కలకలం సృష్టించాయి. దుండగులు గాల్లోకి కాల్పులు జరిపి రూ.2లక్షలు నగదును ఎత్తుకెళ్లారు. మద్యం దుకాణం వద్ద దండగులు కాల్పులకు తెగబడి, మూడు రౌండ్లు గాల్లో కాల్పులు జరిపినట్లు స్థానిక పోలీసులకు సమాచారం అందింది. ఈ ఘటన చింతలపల్లి మండలం ఉద్దెమర్రిలో జరిగింది. మంకీ క్యాప్ ధరించి ముగ్గురు వ్యక్తులు కాల్పులు జరిపారు. వైన్‌షాప్‌లో పని చేస్తున్న జైపాల్ రెడ్డి, బాలకృష్ణపై వారు దాడి చేశారు. కర్రలతో దాడి చేసి, తుపాకులతో బెదిరించి నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు వెల్లడించారు.
మేడ్చల్‌లో కాల్పుల కలకలం.. మద్యం దుకాణంలో నగదు దోచుకెళ్లిన దొంగలు - 2లక్షల నగదును ఎత్తుకెళ్లిన దుండగులు
Incident of Firing in Medchal District: మేడ్చల్ జిల్లాలో కాల్పులు కలకలం రేపాయి. దుండగులు గాల్లోకి కల్పులు జరిపి నగదును ఎత్తుకెళ్లారు. ఈ మేరకు వారు వైన్‌షాప్‌లో పనిచేస్తున్న వారిపై దాడి చేసి, తుపాకులతో బెదిరించి నగదు ఎత్తుకెళ్లినట్లు బాధితులు తెలిపారు.
firing caused a stir in Medchal district