ఆంధ్రప్రదేశ్లోని విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగాయి. పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో పోలీసుల సోదాలు నిర్వహిస్తుండగా.. మావోయిస్టులు ఎదురుపడ్డారు.
Firing: పోలీసులు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు - పెద్దంపల్లి అటవీప్రాంతం
ఏపీలోని విశాఖ జిల్లా గూడెం కొత్తవీధి మండలం పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి. పెద్దంపల్లి అటవీ ప్రాంతంలో పోలీసులు సోదాలు నిర్వహిస్తుండగా... మావోయిస్టులు ఎదురుపడ్డారు. అక్కడి నుంచి తప్పించుకునేందుకు పోలీసులపై కాల్పులు జరపారు. ప్రతిగా పోలీసులు ఎదురు కాల్పులు చేపట్టారు.
ఎదురుకాల్పులు
తప్పించుకునేందుకు ప్రయత్నిస్తూ... మావోయిస్టులు పోలీసులపై కాల్పులు జరిపారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు తిరిగి కాల్పులు చేశారు. అక్కడి నుంచి మావోయిస్టులు తప్పించుకోగా.. వారి ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
ఇదీ చదవండి:NIA RAIDS: రాష్ట్రంలో ఎన్‌ఐఏ సోదాలు... పేలుడు పదార్థాలు స్వాధీనం