ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల కేంద్రంలోని ఫ్రెండ్స్ కాలనీలో బాణసంచా పేలి ఓ వ్యక్తి అక్కడికక్కడే సజీవ దహనం అయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. లావేరు మండలం వేణుగోపాలపురం గ్రామానికి చెందిన యామల కామరాజు (38) రణస్థలంలో వడ్రంగి పని చేస్తూ గత కొన్నాళ్లుగా ఉంటున్నాడు. తన స్నేహితుడి వివాహం కోసం విజయనగరంలో బాణసంచా కొనుగోలు చేసి తన పని చేస్తున్న షెడ్డులో ఉంచాడు. ఇవాళ బాణసంచా ఒక్కసారిగా పేలింది. ఈ సమయంలో కామరాజు షెడ్లో చిక్కుకోవడంతో అక్కడికక్కడే సజీవ దహనమయ్యాడు.
బాణసంచా పేలుడు... ఒకరు సజీవదహనం - శ్రీకాకుళం జిల్లా లేటెస్ట్ అప్డేట్స్
ఏపీలోని శ్రీకాకుళం జిల్లా రణస్థలంలో విషాదం చోటు చేసుకుంది. బాణసంచా పేలి వ్యక్తి మృతి మృతి చెందాడు. కామరాజు(38) అనే వ్యక్తి తన స్నేహితుడి పెళ్లి కోసం తెచ్చిన బాణసంచాను వడ్రంగి షెడ్డులో ఉంచాడు. షెడ్డులో కామరాజు వడ్రంగి పనిచేస్తుండగా బాణసంచా పేలి... మంటలు ఎగిసిపడి షెడ్డు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో కామరాజు సజీవ దహనమయ్యాడు.
బాణసంచా పేలుడు... ఒకరు సజీవదహనం
ప్రమాదంలో షెడ్డు పూర్తిగా కాలిపోయింది. లోపల ఉన్న సామగ్రి అంతా కాలి బూడిదైంది. ప్రమాదంపై శ్రీకాకుళం డివిజన్ డీఎస్పీ ఎం.మహేంద్ర ఘటనాస్థలికి చేరుకొని పరిశీలించారు. వీరితో పాటు క్లూస్ టీం క్షుణ్ణంగా ఘటనాస్థలాన్ని పరిశీలించారు. ఘటనపై మృతుని భార్య నాగమణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు జె.ఆర్.పురం సీఐ, ఎస్సై రాజేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం శ్రీకాకుళం ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు.
ఇవీ చదవండి: