Fires in Bus: హైదరాబాద్ బహదూర్‌పుర పోలీస్ స్టేషన్ పరిధిలోని మీర్ఆలం పీఎస్ పరిధిలో ప్రైవేటు బస్సులో మంటలు వ్యాపించాయి. ఓ గ్యారేజ్‌లోని బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ప్రమాద స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటల్ని ఆర్పారు. ఘటనా సమయంలో అక్కడా ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. ఘటనకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
ఇవీ చదవండి:వీహెచ్ ఇంటిపై రాళ్ల దాడి.. కారు ధ్వంసం.. సీసీదృశ్యాలు వైరల్..