తెలంగాణ

telangana

ETV Bharat / crime

Fire in RTC BUS: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. ఆకతాయిల పనేనా?

Fire in RTC BUS: ములుగు జిల్లాలో ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. వెంకటాపురం మండల కేంద్రంలోని బస్టాండ్​లో బస్సును నిలిపి ఉంచగా మంటలు చెలరేగి బస్సు సీటు దగ్ధమైంది. ఆకతాయిలెవరైనా బస్సుకు నిప్పంటించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

Fire in BUS: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. ఆకతాయిల పనేనా?
Fire in BUS: ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. ఆకతాయిల పనేనా?

By

Published : Dec 15, 2021, 1:27 PM IST

Fire in RTC BUS: ములుగు జిల్లా వెంకటాపురం మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్​లో భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో తెల్లవారుజామున అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఆకతాయిలెవరైనా బస్సుకు నిప్పంటించి ఉంటారని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. బస్సు వెనుక చక్రం భాగంలో మంటలు చెలరేగి ఒక సీటు దగ్ధమైంది. బస్టాండ్ సమీపంలోని ఆటోడ్రైవర్లు, ఆర్టీసీ కండక్టర్, డ్రైవర్ సకాలంలో స్పందించి మంటలు ఆర్పడంతో భారీ నష్టాన్ని తప్పించారు. చత్తీస్​గఢ్​ రాష్ట్రానికి సరిహద్దుగా ఉన్న వాజేడు, వెంకటాపురం, చెర్ల మండలాలకు ప్రయాణికుల సౌకర్యార్థం కోసం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం నుంచి ఆర్టీసీ బస్సులు నిత్యం వస్తుంటాయి.

భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులు వెంకటాపురం బస్టాండ్​లో రాత్రి పార్క్​ చేస్తారు. భద్రాచలం నుంచి చర్ల మండలం మీదుగా వెంకటాపురం మండలానికి రాత్రి నైట్ అవుట్​గా వచ్చిన బస్సు బస్టాండ్​లోని చీకటి ప్రదేశంలో పార్క్​ చేశారు. రాత్రి ఆ బస్సులో మంటలు చెలరేగగా.. ఒక సీటు దగ్ధమైంది. ఆకతాయిలు ఎవరైనా చేశారా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వాజేడు, వెంకటాపురం, చెర్ల మండలాలు చత్తీస్​గఢ్​ రాష్ట్రానికి సరిహద్దుగా ఉంటాయి. గతంలో మావోయిస్టులు వాహనాలను దగ్ధం చేశారు. ఈ నేపథ్యంలో మావోయిస్టులు చేసి ఉంటారా లేక ఆకతాయిలు చేసి ఉంటారా అని అనుమానాలు తలెత్తుతున్నాయి.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details