తెలంగాణ

telangana

ETV Bharat / crime

పార్కింగ్ చేసిన వాహనాలకు నిప్పు పెడుతున్నారు.. జాగ్రత్త..! - ysr district latest news

Fire To Vehicles: గుర్తు తెలియని వ్యక్తులు వాహనాలకు నిప్పు పెడుతుండడంతో అక్కడి వారు భయానికి లోనవుతున్నారు. ఇటీవల కాలంలో ఇటువంటి ఘటనలు జరిగిన పోలీసులు సరైన పరిష్కారం చేయకపోవడంతో స్థానికులు వారిపై నమ్మకం కోల్పోతున్నారు. ఈ ఘటన ఏపీలోని వైఎస్సార్ జిల్లాలో జరిగింది.

Fire
Fire

By

Published : Jan 26, 2023, 4:24 PM IST

Fire To Vehicles: ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్సార్ జిల్లా వేంపల్లెలో వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడం మళ్లీ మొదలు పెట్టారు. ఇటీవల కాలంలో నాలుగు మోటర్ బైకులకు, కారుకు నిప్పు పెట్టడం జరిగింది. పోలీసులు నిఘా పెట్టి ఒక మానసిక రోగిపై అనుమానంతో ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకొని మానసిక ఆసుపత్రికి తరలించారు. కొద్ది రోజులు మౌనంగా ఉన్న గుర్తు తెలియని దుండగులు.. మళ్లీ రంగంలోకి దిగి వాహనాలకు నిప్పు పెడుతున్నారు.

వేంపల్లెలోని తిరుమల సినిమా హాల్ వద్ద గురువారం తెల్లవారుజామున మహమ్మద్ రఫి పార్కింగ్ చేసిన కొత్త కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెడుతుండగా స్థానిక మహిళలు చూసి కేకలు వేశారు. దీంతో దుండగులు పరారైనట్లు వారు తెలిపారు. వేంపల్లెలో వరుసగా వాహనాలకు నిప్పు పెడుతుండడంతో పోలీసులకు ఛాలెంజ్​గా మారింది.

ఇవీ చదవండి

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details