Fire on car at peddhamberpet outer ring road: పెద్దఅంబర్ పేట్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద TS07GX5897 నంబరు గల కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. రాత్రి విశాఖపట్నం నుంచి హైదరాబాద్‌కు విజయవాడ రహదారిపై వస్తుండగా కార్లో మంటలు వచ్చాయి.
ఒక్కసారిగా కారులో మంటలు.. అందులో ఆరుగురు.. డ్రైవర్ ఏం చేశాడంటే? - తాజా నేర వార్తలు
Fire on car at peddhamberpet outer ring road: ప్రయాణంలో ఉన్న కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటన పెద్ద అంబర్పేట్ అవుటర్ రింగ్‌రోడ్డు వద్ద జరిగింది. అందులో ఉన్న ఆరుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. సమాచారం అందుకు అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
కారులో మంటలు
వెంటనే అప్రమత్తమైన కారులో ఉన్న ఆరుగురు వ్యక్తులు వెంటనే కారు దిగడంతో ప్రమాదం తప్పింది. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఇవీ చదవండి: