పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం.. భారీగా ఎగిసిపడుతున్న మంటలు - రసాయన పరిశ్రమలో మంటలు
పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
13:07 April 17
పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం
హైదరాబాద్ జీడిమెట్ల పారిశ్రామికవాడలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దూలపల్లిలోని రసాయన పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి. భారీ శబ్దాలతో రసాయన డ్రమ్ములు ఎగిరిపడుతున్నాయి.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనస్థలానికి చేరుకున్నారు. రెండు అగ్నిమాపక యంత్రాలతో మంటలార్పుతున్నారు. ఈ ఘటనలో ఒకరికి గాయాలు కాగా క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు.
ఇదీ చూడండి:వైమానిక దళానికి బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు
Last Updated : Apr 17, 2021, 2:17 PM IST