తెలంగాణ

telangana

ETV Bharat / crime

Car fire: కారులో మంటలు.. డ్రైవర్​కు తీవ్రగాయాలు - car accident at narsingi orr

అతివేగంతో ఓ కారు డివైడర్​ను ఢీకొట్టింది. చూస్తుండగానే కారులో మంటలు చెలరేగాయి. ప్రమాదంలో కారు డ్రైవర్​ శరీరం 60 శాతం కాలిపోయింది.

కారులో చెలరేగిన మంటలు..
కారులో చెలరేగిన మంటలు..

By

Published : Jun 5, 2021, 7:28 AM IST

రంగారెడ్డి జిల్లా నార్సింగి సమీపంలోని ఓఆర్​ఆర్​పై రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారు అదుపుతప్పి డివైడర్​ను ఢీకొట్టడంతో మంటలు చెలరేగాయి. చూస్తుండగానే మంటలు వ్యాపించడంతో కారులో ఉన్న మాణిక్యం అనే యువకుడి శరీరం 60 శాతం కాలిపోయింది.

గమనించిన స్థానికులు యువకుడిని కారులో నుంచి బయటకు తీశారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. క్షతగాత్రుడిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న నార్సింగి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కారులో చెలరేగిన మంటలు..

ఇదీ చూడండి: Family Suicide: పక్కింటోళ్లతో గొడవ.. నలుగురి ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details