రోడ్డుపై ఆగి ఉన్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఒకరు అగ్నికి ఆహుతైన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. బోధన్ రోడ్డులో నిలిపి ఉంచిన లారీలో అకస్మాత్తుగా దట్టమైన పొగలు రావడాన్ని స్థానికులు గమనించారు. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. మంటలు ఆర్పేలోపే క్యాబిన్లో ఉన్న వ్యక్తి మరణించాడు.
లారీ దగ్ధం... ఒకరు సజీవదహనం - తెలంగాణ వార్తలు
రోడ్డుపై ఆగి ఉన్న లారీలో అకస్మాత్తుగా మంటలు చెలరేగి ఒకరు అగ్నికి ఆహుతైన ఘటన నిజామాబాద్ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది. దట్టమైన పొగలు రాగా స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. మంటలు ఆర్పేలోపే క్యాబిన్లో ఉన్న వ్యక్తి మృతి చెందాడు.
లారీ దగ్ధం.. ఒకరి సజీవదహనం
మృతి చెందిన వ్యక్తి లారీ డ్రైవర్ అయ్యి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. లారీ ఎక్కడి నుంచి వచ్చింది? చనిపోయిన వ్యక్తి ఎవరూ అనే వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:దారుణం: 4 నెలల చిన్నారిని నేలకేసి కొట్టి చంపిన తండ్రి