కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పోల్కంపేట్ గేట్ వద్ద ఓ లారీ దగ్ధం అయ్యింది. లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన డ్రైవర్ వాహనం నుంచి దిగిపోయాడు. మంటల్లో లారీ పూర్తిగా కాలిపోయింది.
లైవ్ వీడియో : ధాన్యం బస్తాల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం - తెలంగాణ వార్తలు
కామారెడ్డి జిల్లా పోల్కంపేట్ గేట్ వద్ద లారీలో అగ్ని ప్రమాదం జరిగింది. ధాన్యం లోడుతో వెళ్తున్న లారీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ధాన్యం పూర్తిగా దగ్ధమైంది.
![లైవ్ వీడియో : ధాన్యం బస్తాల లోడుతో వెళ్తున్న లారీ దగ్ధం fire in lorry, fire in lorry in kamareddy](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11473479-thumbnail-3x2-lorry-fire---copy.jpg)
లారీలో మంటలు, పోల్కంపేట్లో లారీలో చెలరేగిన మంటలు
ఎల్లారెడ్డి నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న లారీ ప్రమాదవశాత్తు పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. కాసేపు ట్రాఫిక్‌కి అంతరాయం కలిగింది.
లారీలో మంటలు, పోల్కంపేట్లో లారీలో చెలరేగిన మంటలు
ఇదీ చదవండి:ద్విచక్ర వాహనం చోరీ... సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు