Fire accident in Nalgonda : పరిశ్రమలో అగ్నిప్రమాదం... రూ.60లక్షల ఆస్తినష్టం..! - శ్రీ రాఘవేంద్ర ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమ

18:19 December 05
పరిశ్రమలో అగ్నిప్రమాదం... రూ.60లక్షల ఆస్తినష్టం..
Fire accident in Nalgonda : నల్గొండ జిల్లా కట్టంగూర్ మండలం అయిటిపాములలో అగ్ని ప్రమాదం జరిగింది. గ్రామ శివారులోని శ్రీ రాఘవేంద్ర ఫెర్రో అల్లాయ్స్ పరిశ్రమలో మంటలు చెలరేగాయి. భారీ ఎత్తున ఎగిసిపడుతున్న మంటలను అదుపుచేసేందుకు అగ్నిమాపక శాఖ అధికారులు ప్రయత్నిచారు. ట్రాన్స్‌ఫార్మర్‌లో ఆయిల్ లీకేజీ వల్ల అగ్ని ప్రమాదం జరిగినట్లు తెలిసింది.
అగ్ని ప్రమాదం వల్ల భారీగా ఆస్తినష్టం జరిగిందని యాజమాన్యం అంటోంది. సుమారు రూ.60 లక్షల నష్టం జరిగిందని పరిశ్రమ యాజమాన్యం వెల్లడించింది. ఎటువంటి ప్రాణహాని జరగకుండా కార్మికులందరినీ బయటకు పంపేసినట్లు తెలిపింది. మరోవైపు హైవేపై దట్టమైన పొగ అలుముకుంది. సమీప గ్రామాల ప్రజల్లో ఆందోళన నెలకొంది.
ఇదీ చూడండి:Car fire in Chittoor : కారులో మంటలు... చిన్నారి సహా ఆరుగురు సజీవదహనం