గోదాములో అగ్నిప్రమాదం... అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది - ఆదిలాబాద్‌లో గోడౌన్లో అగ్నిప్రమాదం
10:03 January 25
గోదాములో అగ్నిప్రమాదం... అదుపులోకి తెచ్చిన అగ్నిమాపక సిబ్బంది
ఆదిలాబాద్ వ్యవసాయ మార్కెట్‌యార్డు సమీపంలోని ప్రైవేటు గోదాంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. గోదాం నుంచి మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మూడుగంటలు శ్రమించి మంటలు అదుపు చేశారు.
దట్టమైన పొగలు సమీపంలోని భాగ్యనగర్ కాలనీ పరిసరాల్లో వ్యాపించగా.. స్థానికులు భయాందోళన చెందారు. ప్రమాదం జరిగిన గోదాం జనవాసాలకు దూరంగా ఉండడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.
ఇదీ చదవండి :ఇద్దరి దారుణహత్య: బండరాళ్లతో మోది కిరాతకంగా చంపేశారు!