ఖమ్మం జిల్లా వైరాలో భద్రాచలం వెళ్తున్న ఆర్టీసీ గరుడ బస్సు అగ్నిప్రమాదాని(bus fire accident)కి గురైంది. హైదరాబాద్ నుంచి 20 మంది ప్రయాణికులతో బస్సు భద్రాచలం(bhadrachalam bus timings) వెళ్తోంది. ఈ క్రమంలో బస్సు వైరా ప్రధాన కూడలి వద్దకు రాగానే ఇంజిన్ నుంచి పొగలు రావటం ప్రారంభించాయి. ఈ విషయాన్ని స్థానికులు గమనించి డ్రైవర్‌కు తెలిపారు. బస్సు ఆపి చూసేలోపే మంటలు(fire in bus) చెలరేగాయి.
Bus Fire accident: గరుడ బస్సులో మంటలు.. పొగ వస్తుందని చూసేలోపే.. - fire accident to bhadrachalam bus
18:56 November 14
Bus Fire accident: గరుడ బస్సులో మంటలు.. పొగ వస్తుందని చూసేలోపే..
డ్రైవర్ అప్రమత్తమై.. వెంటనే బస్సులో ఉన్న ప్రయాణికులను కిందికి దించేశారు. మంటలు ఎగిసిపడుతుండటం(bus fire accident)తో... ప్రయాణికులు భయాందోళనలతో పరుగులు పెట్టారు. అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వటంతో.. తక్షణమే స్పందించి హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్నారు.
అప్పటికే.. మంటలార్పేందుకు స్థానికులు ప్రయత్నించారు. వాళ్ల శ్రమతో.. మంటలు మరింత వ్యాప్తి చెందకుండా అదుపు చేశారు. వారికి తోడు.. అగ్నిమాపక సిబ్బంది కూడా రావటం వల్ల.. మంటలను సకాలంలో అదుపు చేశారు. దీని వల్ల బస్సు పూర్తిగా దగ్ధం కాకుండా నివారించినట్టైంది. ప్రమాదాన్ని ముందే గ్రహించటంతో.. ప్రయాణికులంతా క్షేమంగా బయటపడ్డారు. ఎవరికీ ఎలాంటి నష్టం జరగకపోవటం వల్ల అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: