తెలంగాణ

telangana

ETV Bharat / crime

ప్రభుత్వ జూనియర్ కళాశాలకు నిప్పు.. ఆకతాయిల పనేనా - Metpally Government Junior College

జగిత్యాల జిల్లా మెట్‌పల్లి ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కళాశాలలో నిన్న రాత్రి రెండు గదులకు ఆకతాయిలు నిప్పటించారు. దీంతో విద్యా, వైజ్ఞానిక సదస్సు కోసం విద్యార్థులు తయారుచేసిన పలు పరికరాలు, కళాశాల సామగ్రి దగ్ధమయ్యాయి.

Jagtial district
Jagtial district

By

Published : Jan 23, 2023, 12:30 PM IST

ఆ కళాశాలకు చెందిన విద్యార్థులు విద్యా వైజ్ఞానిక సదస్సు కోసం వివిధ రకాల పరికరాలు, నమునాలు తయారు చేసుకున్నారు. ఈ రోజు భారీ ఎత్తున్న ఆ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఈ క్రమంలోనే వారికి ఊహించని షాక్ తగిలింది. కొందరు ఆకతాయిలు నిన్న రాత్రి వారు భద్రపరచుకున్న నమునాలకు నిప్పు పెట్టారు. ఈ క్రమంలోనే కళాశాలకు చెందిన సామగ్రి దగ్ధమైంది. దీంతో విద్యార్థులు ఎంతో కష్టపడి తయారు చేసిన వివిధ వస్తువులు.. అగ్నికి ఆహుతవ్వడంతో వారు ఆవేదన వ్యక్తం చేశారు.

అసలేం జరిగిదంటే:జగిత్యాల జిల్లాలో మెట్​పల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యా, వైజ్ఞానిక సదస్సు నిర్వహించాలని అనుకున్నారు. ఇందుకనుగుణంగా విద్యార్థులు ఆవిష్కరణలు, పరికరాలు రూపొందించారు. గత ఇరవై రోజుల నుంచి ఈ ప్రదర్శన అందరిని ఆకట్టుకుంటుంది. వివిధ రకాల నమునాలను రెండు గదులలో భద్రపరిచారు. ఈ క్రమంలోనే ఈరోజు భారీ ఎత్తున విద్యా వైజ్ఞానిక సదస్సు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ ఈ క్రమంలోనే వారికి ఊహించని షాక్ తగిలింది

కొందరు ఆకతాయిలు ఆ గదులకు నిప్పు పెట్టారు. దీంతో వారు తయారుచేసిన వైజ్ఞానిక పరికరాలతో పాటు కళాశాలకు చెందిన కొంత ఫర్నిచర్ కూడా అగ్నికి అహుతయ్యింది. ఈ ఘటనపై ఉన్నత అధికారులకు సమాచారం అందించినట్లు కళాశాల ప్రిన్సిపల్​ వెంకటేశ్వర్​రావు తెలిపారు. ఎంతో ప్రయాస కూర్చి చేసిన నమునాలు ఈ విధంగా కావడంతో విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

"ప్రభుత్వ జూనియర్ కళాశాలలో వినూత్నంగా విద్యా, వైజ్ఞానిక సదస్సును నిర్వహిస్తున్నాం. ఇక్కడ ఎక్కువ సంఖ్యలో పదో తరగతి విద్యార్థులు నమోద జరిగేలా ఈ కార్యక్రమాన్ని రూపొందించాం. అందులో భాగంగా విద్యార్థులు వివిధ రకాల నమూనాలు రూపొందించారు. ఎవరో ఆకతాయిలు వాటికి నిప్పుపెట్టారు. తద్వారా అవి పూర్తిగా కాలిపోయాయి. ఈవిషయాన్ని పై అధికారులకు తెలియచేయడం జరిగింది." - వెంకటేశ్వర్​రావు, జగిత్యాల ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్

ఇవీ చదవండి:రాజధానిలో దారుణం.. వ్యక్తిని వేటాడి, వెంటాడి నరికి చంపిన దుండగులు

బిహార్​లో మరోసారి కల్తీ మద్యం కలకలం.. ముగ్గురు మృతి.. పలువురికి అస్వస్థత

ABOUT THE AUTHOR

...view details