కరీంనగర్ జిల్లా ఆర్నకొండ గ్రామంలోని తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. రాత్రి 8 గంటల సమయంలో బ్యాంకు కార్యాలయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు.
బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం.. భారీ ఆస్తి నష్టం - fire accident in bank
తెలంగాణ గ్రామీణ బ్యాంకులో అగ్ని ప్రమాదం జరిగింది. బ్యాంకు కార్యాలయంలో చెలరెగిన మంటలతో సామగ్రి దగ్ధమైంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా ఆర్నకొండ గ్రామంలో జరిగింది.
తెలంగాణ గ్రామీణ బ్యాంక్‌లో అగ్ని ప్రమాదం
షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్నిప్రమాదం సంభవించి ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేసరికి కంప్యూటర్లు, ఫర్నీచర్ పూర్తిగా దగ్ధమైయ్యాయి.
ఇదీ చదవండి:అంత్యక్రియలకు వెళ్లి వస్తూ అనంతలోకాలకు..