తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి సురభి వాణీదేవి ఘన విజయంతో కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ క్రమంలోనే నిప్పురవ్వలు ఎగిరిపడి భవన్ ప్రాంగణంలో ఉన్న ఎండిన చెట్లపై పడి మంటలు చెలరేగాయి.
తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ఆస్తినష్టం - telangana Bhavan fire accident news
తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి వాణీదేవి గెలుపుతో కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబురాలు చేసుకున్నారు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి.
తెలంగాణ భవన్‌లో అగ్నిప్రమాదం.. తప్పిన ఆస్తి, ప్రాణనష్టం
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్నారు. మంటలను అదుపు చేశారు. ప్రమాదంలో ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
ఇదీ చూడండి: హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ స్థానంలో వాణీదేవికి పట్టం