ఇవీ చదవండి: ఉత్తుత్తి యాప్‌తో .. రూ.100 కోట్లకు పైనే మోసం
శంషాబాద్ విమానాశ్రయంలో అగ్ని ప్రమాదం.. పార్క్ చేసిన కారులో నుంచి మంటలు - Shamshabad Airport Latest News
Fire from a parking car: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ విమానాశ్రయంలోని సీ పార్కింగ్ ఏరియాలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. పార్క్ చేసిన కారులో నుంచి.. అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. వెంటనే గమనించి సిబ్బంది అగ్నిమాపక శాఖ అధికారులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. ఈ ఘటనలో చుట్టుపక్కన ఉన్న 2 వాహనాలు కూడా స్వల్పంగా ప్రమాదానికి గురయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు.
Fire Accident In Shamshabad Airport