హైదరాబాద్‌లోని సైఫాబాద్ నిజాం క్లబ్‌లో అగ్నిప్రమాదం సంభవించింది. అసెంబ్లీ ఎదురుగా ఉన్న క్లబ్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కడే ఉన్న సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
సైఫాబాద్ నిజాం క్లబ్‌లో అగ్నిప్రమాదం... దగ్ధమైన ఫర్నిచర్ - telangana news
హైదరాబాద్‌లోని సైఫాబాద్ నిజాం క్లబ్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. సమయానికి ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు.

సైఫాబాద్ నిజాం క్లబ్‌లో అగ్నిప్రమాదం
క్లబ్‌లోని రెండవ అంతస్తులో గల ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైంది. సమయానికి ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. ఈ ప్రమాదం విద్యుదాఘాతంతో వల్ల జరిగిందా... లేక ఎవరైనా కావాలని చేశారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇదీ చదవండి:Suspicious death: అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి