రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని మాసబ్ చెరువు కట్టపై ఆర్టీసి బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. డ్రైవర్, కండక్టర్లు వెంటనే అప్రమత్తమై 40 మంది ప్రయాణికులను బస్లో నుంచి దింపేశారు.
ఆర్టీసీ బస్సులో మంటలు... ప్రయాణికులు సురక్షితం - ఆర్టీసీ బస్సులో మంటలు
ఆర్టీసీ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగిన ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయంజాల్లో జరిగింది. భయభ్రాంతులకు గురైన ప్రయాణికులు బస్సులోంచి బయటకు పరుగులు తీశారు.
ఆర్టీసీ బస్సులో మంటలు... ప్రయాణికులు సురక్షితం
స్థానికులు మంటలను ఆర్పేయటంతో ప్రమాదం తప్పింది. బస్సు ఇబ్రహీంపట్నం నుంచి సికింద్రబాద్ జేబీఎస్ వైపునకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
ఇదీ చదవండి:బైక్ స్కీమ్ పేరుతో రూ. 54 లక్షలు మోసం..