తెలంగాణ

telangana

ETV Bharat / crime

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. వైద్యుడు సహా ముగ్గురు మృతి - Karthika Children Hospital caught fire

Fire Accident in Hospital in Renigunta: ఏపీలోని తిరుపతి జిల్లా రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. కార్తిక చిన్న పిల్లల ఆసుపత్రిలో మంటలు చెలరేగాయి. ఒక్కసారి మంటలు మొత్తం వ్యాపించడంతో.. ఆస్పత్రిపైనే ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. వైద్యుడు రవిశంకర్‌రెడ్డి మంటల్లోనే సజీవ దహనమయ్యారు.

Tirumala fire accident  breaking
Tirumala fire accident breaking

By

Published : Sep 25, 2022, 8:58 AM IST

Updated : Sep 25, 2022, 9:39 AM IST

Fire Accident in Hospital in Renigunta: ఆంధ్రప్రదేశ్​లోని తిరుపతి జిల్లా రేణిగుంటలోని భగత్ సింగ్ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. కార్తిక చిన్నపిల్లల ఆస్పత్రిలో మంటలు చెలరేగాయి. ఒక్కసారి మంటలు మొత్తం వ్యాపించడంతో.. ఆస్పత్రిపైనే ఉంటున్న వైద్యుడి కుటుంబం మంటల్లో చిక్కుకుపోయింది. వైద్యుడు రవిశంకర్‌రెడ్డి మంటల్లోనే సజీవ దహనమయ్యారు. మరో ఇద్దరు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు.

మంటలకు తోడు పెద్దఎత్తున పొగ కమ్మేయడంతో ఇంట్లో ఉన్నవారు ఊపిరి ఆడక ఉక్కిరిబిక్కిరయ్యారు. తక్షణం స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. అతికష్టం మీద ఇంట్లోకి చేరుకుని వైద్యుడు రవిశంకర్‌రెడ్డి భార్య, అత్తతో పాటు ఇద్దరు పిల్లలను మంటల్లో నుంచి బయటకు తీసుకొచ్చారు. దట్టంగా అలుముకున్న పొగతో తీవ్ర అస్వస్థతకు గురైన చిన్నారులు.. కార్తీక, భరత్‌ పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ ఇద్దరు మృతి చెందారు.

మరో గదిలో నిద్రిస్తున్న వైద్యుడు రవిశంకర్‌రెడ్డి చుట్టూ మంటలు దట్టంగా అలముకోవడంతో ఆయన సజీవదహనమయ్యారు. ఆయనను కాపాడేందుకు అగ్నిమాపక సిబ్బంది చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

ఇవీ చదవండి:

Last Updated : Sep 25, 2022, 9:39 AM IST

ABOUT THE AUTHOR

...view details