హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ చింతలబస్తీలో ఓ ప్రైవేటు వార్తా ఛానల్ భవనంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనాస్థలికి చేరుకున్న సిబ్బంది.. మంటలను అదుపులోకి తెచ్చారు.
వార్తా ఛానల్ భవనంలో అగ్ని ప్రమాదం.. వాటిల్లిన ఆస్తి నష్టం - fire accident in private news channel building in chinthalabasthi
ఖైరతాబాద్‌లోని ఓ ప్రైవేటు వార్తా ఛానల్ భవనంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఘటనలో విలువైన సామగ్రి కాలిపోయింది.
వార్తా ఛానల్ భవనంలో అగ్ని ప్రమాదం
మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడటంతో... కార్యాలయంలోని కంప్యూటర్లు, కెమెరాలు, ఇతర సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది వెల్లడించారు. ఆస్తి నష్టం ఎంత జరిగిందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదని పేర్కొన్నారు.
ఇదీ చదవండి:అక్రమంగా నిల్వ ఉంచిన కలప స్వాధీనం