సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరు మండలంలోని పాశమైలారం పారిశ్రామికవాడలోని ఓ ఫార్మాకంపెనీలో విద్యుదాఘాతంతో అగ్ని ప్రమాదం జరిగింది. సకాలంలో స్పందించిన సంస్థ యాజమాన్యం రెండు అగ్నిమాపక వాహనాల సాయంతో మంటలను అదుపులోకి తెచ్చింది.
ఫార్మాకంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికులంతా క్షేమం - పాశమైలారం పారిశ్రామికవాడలో అగ్ని ప్రమాదం
ఓ ఫార్మాకంపెనీలో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగిన ఘటన సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామికవాడలో జరిగింది. ఈ ప్రమాదంలో కార్మికులంతా క్షేమంగా బయటపడ్డారని పోలీసులు తెలిపారు.
ఫార్మాకంపెనీలో అగ్ని ప్రమాదం.. కార్మికులంతా క్షేమం
పాశమైలారం పారిశ్రామిక వాడలోని పిల్లెట్స్ ఫార్మా పరిశ్రమలో మంగళవారం రాత్రి స్టోర్ విభాగంలో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. చూస్తూ ఉండగానే ఏసీ యంత్రాలు కాలిపోయాయి. ఈ ప్రమాద సమయంలో విధులు నిర్వహిస్తున్న కార్మికులంతా క్షేమంగా బయటపడ్డారని బీడీఎల్ భానూరు పోలీసులు తెలిపారు.