ఏపీలోని అనంతపురం జిల్లా యాడికి మండలం బోయరెడ్డిపల్లి సమీపంలోని పెన్నా సిమెంట్ కర్మాగారం(Fire accident in Penna cement factory)లో అగ్నిప్రమాదం జరిగింది. ఫ్యాక్టరీలోని ఎల్వన్ యూనిట్లో బొగ్గు వేడి చేసే ప్రాంతంలో గ్యాస్ లీకై ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ప్రమాద సమయంలో... అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది.
అప్రమత్తమైన ఫ్యాక్టరీ సిబ్బంది వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన రంగంలోకి దిగిన సిబ్బంది అగ్నిమాపక యంత్రాలతో మంటలను ఆర్పివేశారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. భారీగా ఆస్తినష్టం జరిగినట్లు కర్మాగార సిబ్బంది తెలిపారు.
ఇటీవల సంగారెడ్డిలోనూ ఇదే తరహా ప్రమాదం
ఇటీవల సంగారెడ్డి జిల్లాలోనూ భారీ అగ్నిప్రమాదం(fire accident news in telangana)చోటు చేసుకుంది. జిన్నారం మండలం కాజిపల్లి పారిశ్రామికవాడలోని లీ పరిశ్రమకు చెందిన రసాయన గోదాంలో ఈ ప్రమాదం (fire accident) జరిగింది. రసాయనాలు మండి అగ్నికీలలు ఎగిసిపడటంతో పాటు భారీగా పొగ అలుముకుంది.
ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఉన్న ఓ పరిశ్రమ(fire accident latest news)కు చెందిన అగ్నిమాపక యంత్రం, నీటి ట్యాంకర్లు ఘటన స్థలానికి చేరుకుని.. మంటలు ఆర్పే ప్రయత్నం చేశాయి. గోదాం కావడంతో ఉద్యోగులు పరిమితంగా ఉన్నారు. దీంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. కేవలం ఆస్తి నష్టమే జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.
ఇదీ చూడండి:FLOODS EFFECT IN AP: భారీ వరదల కారణంగా కోవూరు వద్ద కోతకు గురైన హైవే..!