Fire Accident in New Secretariat: హైదరాబాద్‌లో మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న నూతన సచివాలయంలో అగ్ని ప్రమాదం సంభవించింది. సచివాలయంలోని గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న స్టోర్ రూంలో మధ్యరాత్రి 2గంటల సమయంలో మంటలను గమనించిన సిబ్బంది.. ఆర్పేందుకు ప్రయత్నించారు. మంటల తీవ్రత పెరగడంతో వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారమిచ్చారు. అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. కానీ ఆ లోపే మంటలు గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తుకు చేరుకున్నాయి.
హైదరాబాద్ నూతన సచివాలయంలో అగ్నిప్రమాదం - Fire in New Secretariat
06:11 February 03
కొత్త సచివాలయం మెుదటి అంతస్తులో అగ్నిప్రమాదం
స్టోర్ రూంలో ఉన్న ఏసీలు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు మంటల్లో కాలిపోయి దట్టమైన పొగ వ్యాపించింది. అగ్నిమాపక సిబ్బంది 2 గంటల్లో.. 11 అగ్నిమాపక యంత్రాలతో మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. తెల్లవారుజామున 4 గంటలకు మంటలను పూర్తిగా ఆర్పేశారు. అగ్నిప్రమాదం జరిగిన వెంటనే సచివాలయం భద్రత చూసే ఎస్పీఎఫ్, రహదారులు భవనాల శాఖాధికారులు, పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఈ అగ్ని ప్రమాదంలో ఆస్తి నష్టం సంభవించినట్లు తెలుస్తోంది. అధికారులు మాత్రం పెద్దగా నష్టమేమి లేదని.. ఇంటీరియర్ డెకరేషన్ కు ఉపయోగించే ఫ్లైవుడ్, మరికొంత సామాగ్రి మాత్రం కాలిపోయినట్లు చెబుతున్నారు. సచివాలయం చుట్టూ భారీగా పోలీస్ భద్రత ఏర్పాటు చేశారు. మింట్ కౌంపౌండ్ వైపు సైతం పోలీసుల బందోబస్తు చేపట్టారు.
సచివాలయం లోయర్ గ్రౌండ్ ఫ్లోర్‌లో స్వల్ప అగ్నిప్రమాదం జరిగిందని మంత్రి ప్రశాంత్‌రెడ్డి తెలిపారు. స్టోర్ రూంలోని ప్లాస్టిక్ సామాగ్రి నుంచి మంటలు వ్యాపించాయని చెప్పారు. మంటల దాటికి పొగ ఎక్కువగా వచ్చిందని వివరించారు. స్టోర్ రూంలో కొంత మేర మినహా ఎక్కడా నష్టం జరగలేదని ప్రశాంత్‌రెడ్డి వెల్లడించారు.
ఇవీ చదవండి:హైదరాబాద్‌లో మరో భారీ అగ్నిప్రమాదం.. బాగ్‌లింగంపల్లిలో ఎగిసి పడుతున్న మంటలు
కుక్కను దొంగతనం చేసిన బీటెక్ స్టూడెంట్స్.. హెల్మెట్‌లో పెట్టి సైలెంట్‌గా..