Fire Accident in Sangareddy District : సంగారెడ్డి జిల్లాలోని ఓ రసాయన పరిశ్రమలో జరిగిన అగ్ని ప్రమాదంలో.. ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామిక వాడాలోని.. మైలాన్ పరిశ్రమలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. గోదాంలో టెట్రా మేతేలే డిసిలోక్సానే అనే రసాయనాన్ని.. ఒక చోటు నుంచి మరో చోటుకు తరలిస్తుండగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పివేశారు.
మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి - Fire accident in Sangareddy district
Sangareddy District
15:00 January 08
మైలాన్ పరిశ్రమలో అగ్ని ప్రమాదం.. ముగ్గురు మృతి
ఈ ప్రమాదంలో పరిశ్రమ అసిస్టెంట్ మేనేజర్, శ్రీకాకుళం వాసి లోకేశ్వర్‌రావు (38), కార్మికులు బెంగాల్ వాసి పరితోష్ మెహతా (40), బిహార్ వాసి రంజిత్ కుమార్ (27) తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో దుర్మరణం చెందారు. అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చదవండి:డివైడర్ ఢీకొని కారు బోల్తా... ముగ్గురు మృతి
Last Updated : Jan 8, 2023, 4:03 PM IST