మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా మల్లాపూర్ గ్రీన్‌హిల్స్ కాలనీలోని ఓ ఇంట్లో అగ్నిప్రమాదం(Fire accident today) సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న వ్యక్తి స్పృహ కోల్పోయాడు. బాధితుడిని ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను ఆర్పివేశారు. ఇంట్లో నిల్వ ఉంచిన డీజిల్, కిరోసిన్, వైట్నర్ వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా గుర్తించారు.
Fire accident today: అపార్టుమెంట్లో మంటలు.. మంటల్లో కాలి వ్యక్తి మృతి - తెలంగాణ వార్తలు
![Fire accident today: అపార్టుమెంట్లో మంటలు.. మంటల్లో కాలి వ్యక్తి మృతి Fire ACCIDENT in Mallapur Greenhills Colony](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-13657217-398-13657217-1637135436034.jpg)
12:50 November 17
Fire accident today: అపార్టుమెంట్లో మంటలు.. మంటల్లో కాలి వ్యక్తి మృతి
మూడో అంతస్థులోని భవనంలో మంటలు చెలరేగిన సమయంలో... అనిల్ అనే వ్యక్తి చిక్కుకున్నాడు. ఇంట్లో మంటలు వ్యాపించగా... బాధితుడు బాత్రూలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ పొగ వల్ల అనిల్ స్పృహ కోల్పోయాడు. బాధితుడిని హుటాహుటిన స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అతడు మృతిచెందాడు.
ఇంటికి వేసే పెయింట్‌లో వీటిని వాడుతారని... ఇలా ఇంట్లో నిల్వ ఉంచడం చాలా ప్రమాదకరమని స్థానికులు చెబుతున్నారు. ఇళ్లలో ఇలాంటి పదార్థాలు ఉంచవద్దని పలుమార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఇంట్లో 14 డ్రమ్ములను నిల్వ ఉంచినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బాధితుడు బయటకు రావాల్సిందిపోయి... లోపలికి వెళ్లాడని అన్నారు. బయటకు వస్తే ప్రాణాలతో బయటపడేవాడని చెబుతున్నారు.
ఇదీ చదవండి:Syringe in beer bottle: బీరు సీసాలో సిరంజీ .. ఉలిక్కి పడ్డ మద్యం ప్రియుడు