Fire Accident In Karachi Bakery Godown: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గగన్ పహాడ్‌లోని కరాచి బేకరీ గోడౌన్లో తెల్లవారుజామున అగ్నిప్రమాదం జరిగింది. మంటలు పెద్దఎత్తున ఎగిసిపడ్డాయి. మంటలను చూసిన స్థానికులు వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం అందజేశారు. వెంటనే అక్కడికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు.
ఈ ఘటనలో సూమారు రూ.10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.