తెలంగాణ

telangana

ETV Bharat / crime

హోటల్లో సిలిండర్ పేలుడు.. భార్యాభర్తలకు గాయాలు - fire accident in hotel

వికారాబాద్ జిల్లా దౌల్తాబాద్​ మండలంలోని ఓ హోటల్లో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. వంట చేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్​ పేలి.. భార్యాభర్తలకు తీవ్రగాయాలయ్యాయి.

fire accident in doulthabad hotel
హోటల్లో అగ్నిప్రమాదం

By

Published : Apr 17, 2021, 1:36 PM IST

హోటల్లో వంటచేస్తుండగా ప్రమాదవశాత్తు సిలిండర్​ పేలడంతో భార్యాభర్తలిద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. హోటల్​ పూర్తిగా తగలబడిపోయింది. వికారాబాద్​ జిల్లా దౌల్తాబాద్​ మండల కేంద్రంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

మండల కేంద్రంలో దంపతులు మల్లప్ప, రేణుక కొన్నిరోజులుగా చిన్న హోటల్​ పెట్టుకొని జీవనం సాగిస్తున్నారు. రేణుక వంట చేస్తుండగా పక్కనే ఉన్న పెట్రోల్​తో నిండిన డబ్బా కింద పడిపోయింది. దానిని తీసేలోపే పెద్ద శబ్దంతో సిలిండర్​ పేలిందని స్థానికులు వెల్లడించారు. వారి సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. సిబ్బంది మంటలను ఆర్పారు. క్షతగాత్రులకు కొడంగల్​ ఆస్పత్రికి తరలించారు.

హోటల్లో అగ్నిప్రమాదం

ఇదీ చదవండి:లైవ్ వీడియో : మైలార్​దేవ్​పల్లిలో యువకుడి కిడ్నాప్..

ABOUT THE AUTHOR

...view details