నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా జరిగిన ఈ ప్రమాదంలో అత్యంత విలువైన సీటీ స్కాన్ యంత్రం దగ్ధమైందని ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ సిబ్బంది... వెంటనే అప్రమత్తమై మంటలను అదుపులోకి తీసుకువచ్చారు.
ప్రభుత్వాస్పత్రిలో అగ్ని ప్రమాదం.. విలువైన సామాగ్రి దగ్ధం - తెలంగాణ వార్తలు
నిజామాబాద్ ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో విలువైన సామాగ్రి దగ్ధమైనట్లు ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని వెల్లడించాయి.
ప్రభుత్వ ఆస్పత్రిలో అగ్ని ప్రమాదం, నిజామాబాద్ ఆస్పత్రిలో ప్రమాదం
ఆస్పత్రిలో ఒక్కసారిగా పొగలు రావడంతో అక్కడ చికిత్స పొందుతున్నవారు, వారి సహాయకులు, సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. అగ్నిప్రమాదంపై పోలీసులు సమీక్షించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:ఆక్సిజన్ కొరతతో 8 మంది కరోనా రోగులు మృతి