మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పరిధిలోని ఎంఎన్రెడ్డి నగర్లో స్వల్ప అగ్నిప్రమాదం సంభవించింది. డెకరేషన్ సామగ్రి నిలువ ఉంచే గోదాంలో మంటలు చెలరేగాయి. వెంటనే స్పందించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు.
గోదాంలో అగ్నిప్రమాదం... డెకరేషన్ సామగ్రి దగ్ధం - గోదాంలో అగ్నిప్రమాదం... డెకరేషన్ సామగ్రి దగ్ధం
మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పరిధిలోని ఎంఎన్రెడ్డి నగర్లోని ఓ గోదాం అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో గోదాంలో నిలువ ఉంచిన డెకరేషన్ సామగ్రి దగ్ధమైంది.

fire accident in godown at mn reddy nagar
హుటాహుటిన ఘటనా స్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది... మంటలను ఆర్పేశారు. గోదాంలో నిల్వ ఉన్న డెకరేషన్ సామగ్రి పూర్తిగా దగ్ధమైంది. ఎక్కువ శాతం ఫైబర్ సామగ్రి ఉండడం వల్ల భారీగా పొగలు వ్యాపించాయి. నష్టాన్ని అంచనా వేస్తున్నారు. ఎవరైనా సిగరెట్ ను అక్కడ పడేసి ఉండవచ్చని అందువల్ల మంటలు చెలరేగినట్లు స్థానికులు అనుమానిస్తున్నారు.