తెలంగాణ

telangana

ETV Bharat / crime

లారీలో పేలిన 100కి పైగా గ్యాస్‌ సిలిండర్లు.. - ప్రకాశం జిల్లా తాజా వార్తలు

ఏపీలోని ప్రకాశం జిల్లాలో అగ్నిప్రమాదం జరిగింది. గ్యాస్‌ సిలిండర్‌ లోడుతో వెళ్తున్న లారీ ఇంజిన్‌లో విద్యుదాఘాతంతో మంటలు చెలరేగాయి. పెద్ద శబ్దాలతో లారీలోని సిలిండర్లు పేలాయి.

లారీలో పేలిన 100కి పైగా గ్యాస్‌ సిలిండర్లు..
లారీలో పేలిన 100కి పైగా గ్యాస్‌ సిలిండర్లు..

By

Published : Sep 2, 2022, 8:04 AM IST

సిలిండర్ లోడ్​తో వెళ్తున్న లారీ ఇంజిన్​లో మంటలు.. పేలిన గ్యాస్​ సిలిండర్లు

ఆంధ్రప్రదేశ్​లోని ప్రకాశం జిల్లా కొమరోలు మండలం దద్దవాడ గ్రామం వద్ద అనంతపురం-గుంటూరు జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి దాటాక పెను ప్రమాదం చోటు చేసుకుంది. నిండుగా ఉన్న గ్యాస్‌ సిలిండర్లతో వెళుతున్న లారీలో మంటలు చెలరేగాయి. లారీలో 300కి పైగా సిలిండర్లు ఉండగా.. వాటిలో 100కిపైగా పేలాయి. దీంతో లారీ పూర్తిగా దగ్ధమైంది.

స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్నూలు నుంచి నెల్లూరు జిల్లా ఉలవపాడుకు భారత్‌ గ్యాస్‌ సిలిండర్లతో వెళుతున్న లారీ క్యాబిన్‌లో మంటలు వచ్చాయి. గమనించిన వెంటనే డ్రైవర్‌ మోహన్‌రాజు లారీ ఆపి కిందికి దిగి తప్పించుకున్నారు. మంటల్లో ఉన్నవి నిండు గ్యాస్‌ సిలిండర్లు కావడంతో జాతీయ రహదారిపై ఇరు వైపులా అర కి.మీ. దూరంలో వాహనాలు నిలిపివేశారు. కొంచెం సేపటికి సిలిండర్లు పేలడం ప్రారంభం కావడంతో పోలీసులు అప్రమత్తమై అటువైపు ఎవరినీ వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు.

30 ఇళ్లను ఖాళీ చేయించిన పోలీసులు..మంటల వేడికి సిలిండర్లు పేలడంతో అప్రమత్తమైన హైవే పోలీసులు ప్రమాద స్థలానికి 300 మీటర్ల దూరంలో ఉన్న దద్దవాడలో సుమారు 30 ఇళ్లను ఖాళీ చేయించారు. ప్రమాద స్థలానికి అగ్నిమాపక వాహనం వెళ్లినప్పటికీ సిలిండర్లు పేలుతుండటంతో 200 మీటర్ల దూరం నుంచే మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. గ్యాస్‌ లారీలో సిలిండర్లు భారీగా పేలడంతో సమీప గ్రామాల ప్రజలు తీవ్రభయాందోళనకు గురయ్యారు. అటువైపు రాకపోకలను నిలిపేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది.

ABOUT THE AUTHOR

...view details