రంగారెడ్డి జిల్లా కవాడిపల్లి సమీపంలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగాయి. దాదాపు గంటన్నర నుంచి అటవీప్రాంతం తగలబడుతోంది. సమాచారం అందుకున్న అబ్దుల్లాపూర్మెట్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
అటవీప్రాంతంలో మంటలు.. ఆందోళనలో గ్రామస్థులు - అటవీప్రాంతంలో చెలరేగిన మంటలు
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం కవాడిపల్లి సమీపంలోని అటవీప్రాంతంలో మంటలు చెలరేగాయి. అటవీ ప్రాంతం గ్రామానికి దగ్గరలో ఉండడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు.
![అటవీప్రాంతంలో మంటలు.. ఆందోళనలో గ్రామస్థులు fire accident in forest kawadipally village in abdullapirmet mandal in rangareddy district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10817042-967-10817042-1614529969933.jpg)
అటవీ ప్రాంతంలో మంటలు.. ఆందోళనలో గ్రామస్థులు
అడవి గ్రామానికి సమీపంలోనే ఉండడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అధికారులు వెంటనే స్పందించి మంటలను అదుపులోకి తీసుకురావాలని కోరుతున్నారు.
అటవీ ప్రాంతంలో మంటలు.. ఆందోళనలో గ్రామస్థులు