fire accident at dundigal: మేడ్చల్ జిల్లా దుండిగల్ మండల పరిధిలోని డి.పోచంపల్లిలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. గండిమైసమ్మ కూడలి వద్ద గల పత్తి గోదాములో భారీగా మంటలు చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
Fire accident at dundigal: పత్తి గోదాములో అగ్నిప్రమాదం... మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది - తెలంగాణ వార్తలు
Fire accident: మేడ్చల్ జిల్లా దుండిగల్ మండల పరిధిలోని పత్తి గోదాములో అగ్నిప్రమాదం జరిగింది. మంటలు భారీగా చెలరేగాయి. ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పుతున్నారు.
Fire accident at dundigal
విద్యుదాఘాతం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగనప్పటికీ... భారీగా ఆస్తి నష్టం వాటిల్లినట్లు తెలుస్తోంది. మంటలు అధికంగా రావడంతో స్థానిక ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు.
ఇదీ చదవండి:woman bathing secretary record : స్నానాల గదిలో ఉన్న మహిళ వీడియో తీసిన టెక్నీషియన్
Last Updated : Dec 8, 2021, 12:24 AM IST