హైదరాబాద్ పాతబస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. మంగళవారం దివాన్ దేవిడిలోని ఓ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
పాతబస్తీలో అగ్నిప్రమాదం - హైదరాబాద్ నేర వార్తలు
పాతబస్తీలోని దివాన్ దేవిడిలో అగ్నిప్రమాదం జరిగింది. ఓ రెడీమేడ్ వస్త్ర దుకాణంలో మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.
fire accident in cloth showroom in old city
మొదటి అంతస్తులోని దుకాణంలో మంటలు అంటుకుని దట్టమైన పొగ అలుముకుంది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండొచ్చని అధికారులు భావిస్తున్నారు.
ఇదీ చూడండి:అకాల వర్షం: ఆరబెట్టిన ధాన్యం వర్షార్పణం