తెలంగాణ

telangana

ETV Bharat / crime

రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు దుర్మరణం - ఏలూరు జిల్లాలో అగ్ని ప్రమాదం

Fire Accident In Eluru District: ఏపీలోని ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు దుర్మరణం
రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. ఐదుగురు దుర్మరణం

By

Published : Apr 14, 2022, 3:00 AM IST

Updated : Apr 14, 2022, 8:21 AM IST

రసాయన పరిశ్రమలో భారీ అగ్నిప్రమాదం.. ఆరుగురు దుర్మరణం

Fire Accident In Eluru District: ఆంధ్రప్రదేశ్​లోని ఏలూరు జిల్లా మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలోని పోరస్‌ పరిశ్రమలో బుధవారం రాత్రి 10 గంటల సమయంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. రసాయన పరిశ్రమలోని యూనిట్ 4లో ప్రమాదవశాత్తు పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. 13 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలంలోనే ఐదుగురు సజీవ దహనం కాగా.. మార్గమధ్యలో మరొకరు మృతి చెందారు. క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నారు. వారిలో కొందరి పరిస్థితి విషమించటంతో.. మెరుగైన వైద్యం కోసం విజయవాడ తరలించారు. ప్రమాదం జరిగిన సమయంలో పరిశ్రమలో షిప్టులో 150 మంది పని చేస్తున్నట్లు సమాచారం.

విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని.. మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఘటనపై సమాచారం అందుకున్న ఏలూరు ఎస్పీ.. ప్రమాద స్థలిని పరిశీలించారు. ప్రమాదానికి గల కారణాలు, మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. పోరస్‌ పరిశ్రమలో ఔషధ తయారీలో వాడే పొడి ఉత్పత్తి చేస్తున్నట్లు సమాచారం.

పరిశ్రమలో ఒక్కసారిగా మంటలు వచ్చాయి. గేట్లు తీయకపోయేసరికి బలవంతంగా లోపలికి వెళ్లాం. అప్పటికే పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగింది. చక్కెర కర్మాగారాన్ని రసాయన పరిశ్రమగా మార్చారు. ప్రమాదం జరిగాక కంపెనీ వాళ్లు చర్యలు తీసుకోలేదు. అంబులెన్స్‌కు కూడా ఎవరూ ఫోన్ చేయలేదు. షిఫ్టులో 150 మంది వరకు పని చేస్తుంటారు.-బాధితులు

Last Updated : Apr 14, 2022, 8:21 AM IST

ABOUT THE AUTHOR

...view details