fire accident: యాదాద్రి శివారులోని యాదాద్రి లైఫ్ సైన్సెస్ కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. రియాక్టర్లలో ఒత్తిడి అధికమై రసాయనాలు బయటికి ఎగజిమ్మాయి. వెంటనే సైరన్ మోగడం వల్ల కార్మికులు బయటికి పరుగులు తీశారు. కెమికల్ బయటకి ఎగసిపడటంతో స్థానికులు ఆందోళన చెందారు. చుట్టుపక్కల భారీగా పొగలు అలుముకున్నాయి.
fire accident: యాదగిరిగుట్ట శివారులోని రసాయన పరిశ్రమలో ప్రమాదం - yadagirigutta fire accident
19:08 December 12
fire accident: యాదగిరిగుట్ట శివారులోని రసాయన పరిశ్రమలో ప్రమాదం
రియాక్టర్ పేలగానే కంపెనీలో సైరన్ మోగడంతో కార్మికులంతా వెంటనే అలర్ట్ అయి బయటకు పరుగులు తీయడంతో ప్రమాదం తప్పింది. రియాక్టర్ పేలడంతో అందులోంచి కెమికల్ పక్కనే ఉన్న రోడ్డుపైకి ఎగసిపడింది. ఈ క్రమంలో ఆ ప్రాంతమంతా పొగలు కమ్ముకున్నాయి. రసాయనాలు ఎగిసిపడి చెట్లు మాడిపోయాయి.
కంపెనీ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. మరోవైపు కెమికల్ కంపెనీ జనావాసాల్లో ఉండడం వల్ల తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోందని కంపెనీ ఓనర్లతో స్థానికులు వాగ్వాదానికి దిగారు. వెంటనే కంపెనీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: