తెలంగాణ

telangana

ETV Bharat / crime

Fire accident: చెప్పుల కార్ఖానాలో అగ్ని ప్రమాదం.. రూ. 8 లక్షల ఆస్తి నష్టం.! - fire accident in kattalguda

హైదరాబాద్​ పాతబస్తీలోని చెప్పుల కార్ఖానాలో అగ్నిప్రమాదం సంభవించింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

fire accident in chappal manufacturing company
చెప్పుల కార్ఖానాలో అగ్నిప్రమాదం

By

Published : Nov 3, 2021, 8:01 PM IST

హైదరాబాద్ మీర్​చౌక్​ పోలీస్​స్టేషన్​ పరిధిలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కట్టల్​గూడలోని ఓ చెప్పుల తయారీ కేంద్రంలో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. కొద్దిక్షణాల్లోనే అవి తీవ్రరూపం దాల్చడంతో వెంటనే స్ధానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.

చెప్పుల కార్ఖానాలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు

ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. స్థానిక డబీర్​పుర కార్పొరేటర్ అలందార్ వాలజాహి సహాయక చర్యల్లో పాల్గొన్నారు. దాదాపు రూ.7 నుంచి 8లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు పోలీసులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి:Bandi Sanjay: రేపటి నుంచే రాష్ట్రమంతా దళితబంధు అమలు చేయాలి.. లేదంటే...

ABOUT THE AUTHOR

...view details