Fire Accident: మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. మెట్టుగడ్డ పారిశ్రామిక వాడలోని పరుపుల దుకాణంలో యంత్రాలు నడుస్తుండగా.. ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎక్కువ మొత్తంలో పత్తి నిల్వలు ఉండటంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. పెద్ద ఎత్తున పొగ ఎగిసిపడింది. ఘటనస్థలానికి ఆనుకుని ఓవైపు గ్యాస్‌సిలిండర్ల గోదాం, మరోవైపు ధాన్యం నిల్వలు ఉండటంతో సమీప పరిశ్రమల సిబ్బంది ఆందోళనకు గురయ్యారు. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయటంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ యంత్రాలు నడుస్తున్న క్రమంలో నిప్పురవ్వలు ఎగిసిపడి పత్తికి నిప్పంటుకుందని.. క్షణాల్లో పరిశ్రమ అంతటా మంటలు వ్యాపించాయని బాధితులు పేర్కొన్నారు. సుమారు 10లక్షల నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.
Fire Accident: పరుపుల దుకాణంలో భారీ అగ్ని ప్రమాదం.. క్షణాల్లోనే - మెట్టుగడ్డ అగ్ని ప్రమాదం
Fire Accident: మహబూబ్‌నగర్‌లోని మెట్టుగడ్డ పారిశ్రామిక వాడలో అగ్నిప్రమాదం సంభవించింది. ఓ పరుపుల దుకాణంలో యంత్రాలు నడుస్తుండగా ఆకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. అగ్నిమాపక సిబ్బంది సకాలంలో చేరుకుని మంటలను అదుపు చేయటంతో.. పెద్ద ప్రమాదం తప్పింది. సుమారు రూ. 10లక్షల నష్టం వాటిల్లిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.
Fire Accident