హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని బాబుఖాన్ ఎస్టేట్ భవనంలో అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. అక్కడే విధులు నిర్వహిస్తున్న వాచ్మెన్ అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇవ్వగా... వెంటనే స్పందించిన సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.
Fire Accident: బాబుఖాన్ ఎస్టేట్ భవనంలో మంటలు.. తప్పిన ప్రమాదం - Fire Accident news
హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని బాబుఖాన్ ఎస్టేట్ భవనంలో అగ్నిప్రమాదం జరిగింది. భవనంలోని మొదటి అంతస్తులో మంటలు చెలరేగాయి. సకాలంలో స్పందించిన అగ్నిమాపక సిబ్బంది.. మంటలను అదుపు చేశారు.
Fire Accident in babu khan estate building At Basheer bag
ఇతర అంతస్తులకు మంటలు వ్యాపించకుండా అగ్నిమాపక సిబ్బంది జాగ్రత్తలు తీసుకున్నారు. టెర్రస్‌పై ఉన్న చెత్త, సూచిక బోర్డులు అగ్నికి ఆహుతయ్యాయి. రాత్రి సమయం కావటం వల్ల కార్యాలయాలు మూసి ఉండటంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గల కారణాలను అధికారులు ఆరా తీస్తున్నారు.