మేడ్చల్ జిల్లా కీసర వద్ద బాహ్య వలయ రహదారిపై ఆటో మంటల్లో చిక్కుకుంది. కట్టెల లోడుతో వెళ్తున్న ఆటోలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో డ్రైవర్ ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
ఆటోలో ఎగసిన మంటలు.. డ్రైవర్ సురక్షితం - ఓఆర్ఆర్పై ఆటోలో మంటలు
బాహ్య వలయ రహదారిపై వెళ్తున్న ఆటోలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు. మేడ్చల్ జిల్లా కీసర సమీపంలో ఈ ప్రమాదం జరిగింది.
ఓఆర్ఆర్పై మంటల్లో చిక్కుకున్న ఆటో
ఓఆర్ఆర్ ట్రాఫిక్ సిబ్బంది సహాయంతో నీళ్ల ట్యాంకర్‌తో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించారు. అంతలోనే సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చారు. ఓఆర్ఆర్పై ఘట్కేసర్ నుంచి కీసర వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.