నిర్మల్ జిల్లా కుబీర్ మండలం బెల్గాంతండాలో అర్ధరాత్రి పశువుల పాకలో జరిగిన అగ్నిప్రమాదంలో లేగదూడ సజీవదహనమైంది. మోతీలాల్, భీంరావులకు చెందిన పశువులకు తీవ్ర గాయాలు కాగా.. వ్యవసాయ సామగ్రి పూర్తిగా దగ్ధమైంది.
పశువులపాకలో అగ్నిప్రమాదం.. లేగదూడ సజీవదహనం - బెల్గాంతండాలో అగ్నిప్రమాదం
అర్ధరాత్రి సంభవించిన అగ్నిప్రమాదంలో పశువులపాక దగ్ధమైంది. ఈ ఘటనలో లేగదూడ సజీవదహనం కాగా.. మరిన్ని మూగజీవులకు తీవ్ర గాయాలయ్యాయి. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం బెల్గాంతండాలో ఈ ప్రమాదం జరిగింది.
బెల్గాంతండాలో అగ్నిప్రమాదం
పశువులపైనే ఆధారపడి జీవిస్తున్న తమను ప్రభుత్వమే ఆదుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు వేడుకుంటున్నారు. వ్యవసాయ పరికరాలు మంటల్లో పూర్తిగా బూడిదవ్వగా.. కారు స్వల్పంగా కాలిపోయింది. సుమారు రూ.4 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని.. ప్రభుత్వమే వారిని ఆదుకోవాలని తండావాసులు కోరుతున్నారు.