సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం గడ్డపోతారం పారిశ్రామికవాడలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సరాకా లేబొరేటరీ రసాయన పరిశ్రమలో వెల్డింగ్ పనులు నిర్వహిస్తుండగా నిప్పులు చెలరేగి పక్కనే ఉన్న రసాయన డ్రమ్ములపై పడటంతో మంటలు అంటుకున్నాయి. పెద్దఎత్తున ఎగిసిపడిన మంటలతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.
FIRE ACCIDENT: రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ఎగిసిపడిన మంటలు - సంగారెడ్డి జిల్లాలో రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం
సంగారెడ్డి జిల్లా గడ్డపోతారం పారిశ్రామికవాడలోని ఓ రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం జరిగింది. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పులు చెలరేగి రసాయనాలపై పడటంతో ప్రమాదం సంభవించింది. అప్రమత్తమైన పరిశ్రమ యాజమాన్యం.. మంటలను అదుపుచేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
రసాయన పరిశ్రమలో అగ్నిప్రమాదం..
వెంటనే స్పందించిన పరిశ్రమ యంత్రాంగం 'ఫైర్ సేఫ్టీ' పరికరాలతో మంటలను అదుపులోకి తెచ్చింది. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించారు. ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగలేదని బొల్లారం సీఐ ప్రశాంత్ తెలిపారు.