శంషాబాద్ బాహ్య వలయ రహదారిపై ప్రమాదం చోటుచేసుకుంది. ఓ కారులో మంటలు చెలరేగి అగ్నికి ఆహుతయింది. ఘట్కేసర్ నుంచి గచ్చిబౌలి వైపు వెళ్తున్న కారు పెద్ద గోల్కొండ వద్దకు రాగానే కారు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. గమనించిన డ్రైవర్ కారును పక్కకు ఆపి దిగిపోయాడు. క్షణాల్లోనే మంటలు వ్యాపించి.. కారు పూర్తిగా దగ్ధమైంది.
Fire Accident: కారులో చెలరేగిన మంటలు.. డ్రైవర్ సేఫ్ - rangareddy district latest news
శంషాబాద్ ఔటర్ రింగ్‌రోడ్డుపై ఓ కారులో మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు వ్యాపించి కారు పూర్తిగా దగ్ధమైంది. ప్రమాదంలో డ్రైవర్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాడు.
కారులో చెలరేగిన మంటలు
ఓఆర్ఆర్ పెట్రోలింగ్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది.