ఆదిలాబాద్ పట్టణంలో అగ్నిప్రమాదం జరిగింది. సినిమా రోడ్డు సమీపంలోని వాహన సర్వీసింగ్ కేంద్రంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది బయటకు పరుగులు తీసి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు.
వాహన సర్వీసింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం - adilabad fire accident
ఆదిలాబాద్ పట్టణంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. సినిమా రోడ్డు సమీపంలోని వాహన సర్వీసింగ్ సెంటర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది బయటకు పరుగులు తీయడంతో ప్రాణనష్టం తప్పింది.
వాహన సర్వీసింగ్ సెంటర్లో అగ్నిప్రమాదం
ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ముందస్తు జాగ్రత్త చర్యల దృష్ట్యా పట్టణంలో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ముందుగా అప్రమత్తం అవ్వడం వల్ల ఎవరికీ ప్రమాదం జరగలేదని అధికారులు తెలిపారు.
- ఇదీ చూడండి :రైలు కింద పడి యువకుడు బలవన్మరణం