ఇంట్లో చెలరేగిన మంటలు.. మహిళ సజీవదహనం - వనస్థలిపురంలో అగ్నిప్రమాదంలో మహిళ మృతి
10:35 May 24
భార్య సజీవదహనం, భర్తకు గాయాలు
హైదరాబాద్ వనస్థలిపురం ఎఫ్‌సీఐ కాలనీలో అగ్నిప్రమాదం జరిగింది. ఇంట్లో మంటలు చెలరేగి భార్య సజీవదహనమవగా... భర్తకు గాయాలయ్యాయి. ఉదయం 8 గంటల సమయంలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. పడక గదిలో ఉన్న బాలకృష్ణ భార్య సరస్వతి మంటల్లో చిక్కుకుని మృతి చెందింది. భర్త బాలకృష్ణతో పాటు ఇద్దరు పిల్లలు క్షేమంగా బయటపడ్డారు.
వారిని రక్షించే క్రమంలో బాలకృష్ణకు స్వల్ప గాయాలయ్యాయి. ఏసీలో మంటలు రావడంతోనే ఈ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లు ప్రాథమికంగా పోలీసులు అంచనా వేస్తున్నారు. ఎగిసిపడుతున్న మంటలను రెండు అగ్నిమాపక శకటాలతో అదుపులోకి తీసుకువచ్చారు. మృతురాలు సరస్వతి భర్త బాలకృష్ణ ఇద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి ఇంజినీరింగ్ చదివే కుమారుడు, పదో తరగతి చదివే కుమార్తె ఉన్నారు.
ఇదీ చూడండి:తండ్రి మరణించాడని వైద్య విద్యార్థినిపై దాడి!