Fire accident in Ap : కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం - fire accident at kakinada coast
09:54 September 25
Fire accident in Ap : కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం
ఏపీలోని కాకినాడ తీరంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. జీఎంఆర్ పవర్‌ప్లాంట్‌లో మంటలు ఎగిసిపడుతున్నాయి. వెల్డింగ్ పనులు చేస్తుండగా నిప్పురవ్వలు ఎగిసిపడటం వల్ల ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనాస్థలికి చేరుకున్నారు. పవర్‌ప్లాంట్‌లో మంటలను ఆర్పుతున్నారు. ప్లాంట్ సిబ్బంది కూడా మంటలు అదుపులోకి తీసుకువచ్చేందుకు సహకరిస్తున్నారు.
ఈ ఘటనలో ఇప్పటివరకు ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. మంటలు అదుపులోకి వచ్చాక ఎంతమేర నష్టం వాటిల్లిందనేది తెలుస్తుందని చెప్పారు.