Fire Accident : ప్లైవుడ్ గోదాంలో అగ్నిప్రమాదం.. భారీగా నష్టం - fire accident in Hyderabad
09:49 July 13
హైదరాబాద్: బాలానగర్ రంగారెడ్డి నగర్‌లో అగ్నిప్రమాదం
హైదరాబాద్ బాలానగర్ పరిధిలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. స్థానిక గాంధీనగర్ పారిశ్రామిక వాడలోని రంగారెడ్డినగర్‌లో ఉన్న ప్లైవుడ్ గోదాంలో పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. గోదాంపై రెండు అంతస్తులు.. ఉక్కు, రేకులతో నిర్మించారు. మంటల వేడికి ఉక్కు గోదాం పూర్తిగా వంగిపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని రెండు అగ్నిమాపక శకటాలతో మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో స్థానికులు భయాందోళనలకు గురయ్యారు. విద్యుత్ సరఫరాను నిలిపివేసి అగ్నిమాపక సిబ్బంది మంటలార్పారు.
ఈ ఘటనలో ప్రాణపాయం తప్పింది. భారీ మొత్తంలో ఆస్తినష్టం సంభవించినట్లు గోదాం యజమాని తెలిపారు. అగ్నిప్రమాదం జరగడానికి షార్డ్ సర్క్యూటే కారణమై ఉండొచ్చని అగ్నిమాపక అధికారులు భావిస్తున్నారు.